: రూ.1,999 కే అందుబాటులో స్మార్ట్‌వాచ్
ఏఎస్ డబ్ల్యు-11 పేరుతో దేశీయ సంస్థ అంబ్రేన్ ఈ రోజు తక్కువ ధరకే స్మార్ట్ వాచ్ ను విడుదల చేసింది. ఈ స్మార్ట్ వాచ్ ఫిట్నెస్ ట్రాకర్ గా పనిచేస్తుందని తెలిపింది. కేవలం రూ.1,999 కే లభ్యమయ్యే ఈ స్మార్ట్ వాచ్ ద్వారా రోజువారీ ఫిట్నెస్ కార్యకలాపాలను ట్రాక్ చేయవచ్చని తెలిపింది. ఇందులోని పెడోమీటర్ యూజర్ల నడకదూరాన్ని, స్లీప్ పాటర్నీ కూడా పరిశీలిస్తుందని చెప్పింది. ఈ వాచ్‌ను బ్లాక్ కలర్‌లో అందుబాటులోకి తెచ్చామని చెప్పింది. ఒక సంవత్సరం వారెంటీ కూడా ఇస్తున్నామని తెలిపింది. ఏఎస్ డబ్ల్యు-11 ను అన్ని ప్రముఖ రిటైల్, ఈ-టెయిల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చని చెప్పింది.