: ఏడుగురిని కాల్చి చంపిన దుండగుడిని ఘటనాస్థలిలోనే మట్టుబెట్టిన టెక్సాస్ పోలీసులు


అమెరికాలోని టెక్సాస్ లో దారుణం జరిగింది. ఓ ఇంట్లోకి చొరబడిన దుండగుడు విచక్షణారహితంగా కాల్పులకు తెగబడగా, ఏడుగురు అక్కడికక్కడే మరణించారు. మరికొంత మందికి తీవ్రగాయాలు అయ్యాయి. విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన పోలీసులు, లొంగిపొమ్మని హెచ్చరించినా దుండగుడు వినకపోవడంతో ఘటనా స్థలిలోనే కాల్చి చంపారు. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించామని, వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పిన పోలీసు అధికారులు, దుండగుడు ఎందుకు ఇలా తెగబడ్డాడన్న విషయమై విచారణ జరుపుతున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News