: మ‌ణిర‌త్నం సినిమాలో జ్యోతిక‌, నానిల‌తో పాటు శింబు?


మ‌ల్టీస్టార‌ర్‌గా తెర‌కెక్కనున్న మ‌ణిర‌త్నం త‌దుప‌రి ప్రాజెక్టులో జ్యోతిక‌, నానిల‌తో పాటు శింబుకు కూడా స్థానం ల‌భించినట్లు విశ్వ‌స‌నీయ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమాలో న‌లుగురు హీరోలు ఉంటారని వార్తలు కూడా వ‌చ్చాయి. ఆ పాత్ర‌ల కోసం విజ‌య్ సేతుప‌తి, మాధ‌వ‌న్‌, ఫ‌హాద్ పాజిల్‌ల‌ను మ‌ణిర‌త్నం క‌లిసిన‌ట్లు తెలుస్తోంది. అయితే మ‌ణిర‌త్నం సినిమాలో త‌న పాత్ర గురించి జ్యోతిక మీడియాకు వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే.

అలాగే నానితో పాటు ఐశ్వ‌ర్య రాజేశ్ పాత్ర‌లు కూడా అధికారికంగా ఓకే అయ్యాయి. విజ‌య్ సేతుప‌తికి కాల్షీట్లు ఖాళీగా లేక‌పోవ‌డంతో ఈ ప్రాజెక్టుకు అంగీక‌రించే అవ‌కాశం లేన‌ట్టు స‌మాచారం. అయితే ఈ సినిమాలో న‌టీన‌టుల గురించి వెల్ల‌డించ‌డానికి చిత్ర‌యూనిట్ పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌డం లేదు. ఈ చిత్రం షూటింగ్‌ను అక్టోబ‌ర్‌లో ప్రారంభించి వ‌చ్చే వేస‌వికి విడుద‌ల చేసే యోచ‌న‌లో మ‌ణిర‌త్నం ఉన్న‌ట్లు తెలుస్తోంది.

  • Loading...

More Telugu News