: తుపానులకు ఆండ్రూస్, హార్వే, ఇర్మా, జోష్ ఇలా మనుషుల పేర్లు ఎందుకు?
తుపానులకు ఆండ్రూస్, హార్వే, ఇర్మా, జోష్.. అంటూ మనుషుల పేర్లు పెడతారన్న సంగతి తెలిసిందే. 1950 నుంచి ఇది సంప్రదాయంగా వస్తోంది. అంతకు ముందు తుపానులను గుర్తుంచుకునేందుకు విధానం ఏదీ ఉండేది కాదని, 1950లో ఇలా పేర్లు పెట్టే సంప్రదాయానికి అమెరికా వాతావరణ శాఖ తెరలేపిందని తెలుస్తోంది. ఈ క్రమంలో 1953 నుంచి సంభవించిన తుపానులకు మహిళల పేర్లు పెట్టేవారని, 1979 తరువాత ఈ సంప్రదాయంలో పురుషుల పేర్లు కూడా చేర్చారు.
ఒక ఏడాదిలో సంభవించే తుపాన్లకు ఏఏ పేర్లు పెట్టాలో సూచిస్తూ ప్రపంచ వాతావరణ సంస్థ ఒక జాబితాను విడుదల చేస్తుంది. ఈ తుపానులు చేదు అనుభవాలు, చరిత్రలో నిలిచిపోయేలా భారీ నష్టాలను మిగిలిస్తే మాత్రం ఆ పేర్లను కేవలం వాటికి మాత్రమే ఉంచి, మిగిలిన పేర్లను ఆరేళ్ల తరువాత రిపీట్ చేస్తారు. దీంతో భారీ నష్టాన్ని మిగిల్చిన వాటికి తప్ప 2017లో సంభవించిన తుపానుల సందర్భంగా పెట్టిన పేర్లను మళ్లీ 2023లో వినియోగిస్తారు.