: కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విద్యార్థుల చేతి రాత చెత్తగా ఉందట... ల్యాప్ ట్యాప్ ల వాడకం ఫలితం!
బ్రిటన్ లోని ప్రతిష్ఠాత్మక కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విద్యార్థుల చేతి రాత చెత్తగా ఉండట. ల్యాప్ ట్యాప్ ల వినియోగం పెరగడంతో చేతిరాతతో తక్కువ పని పడుతోంది. ఈ నేపథ్యంలో కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ విప్లవాత్మకమైన మార్పు తెచ్చేందుకు శ్రీకారం చుట్టనుందని తెలుస్తోంది. కేవలం పరీక్షల సమయంలో తప్ప ఇతర సమయాల్లో చేతితో రాసేందుకు విద్యార్థులు విముఖత చూపిస్తున్నారని హిస్టరీ డిపార్ట్ మెంట్ అధ్యాపకురాలు డాక్టర్ సారాహ్ పియర్స్ తెలిపారు. ఈ నేపథ్యంలో యూనివర్సిటీలో పరీక్షలను ల్యాప్ టాప్స్, ఐపాడ్స్, కంప్యూటర్లలో రాసే విధంగా ఏర్పాట్లు చేయనున్నారు. అధ్యాపకులు పాఠాలు బోధిస్తున్న సమయంలో కూడా విద్యార్థులు రాసుకోకుండా ల్యాప్ ట్యాప్ లను వినియోగిస్తున్నారని, దీంతో పరీక్షల్లో టైపింగ్ విధానాన్ని అమలు చేయనున్నామని యూనివర్సిటీ చెబుతోంది.
ఇప్పటికే కొన్ని డిపార్ట్ మెంట్స్ టైపింగ్ విధానం ద్వారా పరీక్షలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది. దీనిపై సారాహ్ పియర్స్ స్పందిస్తూ, నేటి విద్యార్థి తరం చేతిరాతను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరవై ఏళ్ల క్రితం విద్యార్థులు గంటల తరబడి రాస్తూ ఉండేవారని అన్నారు. ఇప్పటి విద్యార్థులు కేవలం పరీక్షల సమయాల్లో మాత్రమే చేతిరాత ఉపయోగిస్తుండడంతో వారి రాతను అర్థం చేసుకోవడం కష్టంగా మారిందని తెలిపారు. అంత చెత్తగా రాస్తున్నారని తెలిపారు. ఈ నేపథ్యంలో కొత్త విధానం అమలు చేసే ప్రయత్నంలో యూనివర్సిటీ ఉందని ఆమె తెలిపారు. దీంతో 800 ఏళ్ల చరిత్ర కలిగిన చేతిరాత కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో అంతరిచిపోయేలా కనిపిస్తోంది.