: వారమే గడువు, మీ అసలు పేర్లేవో వెల్లడించండి.. సోషల్ మీడియా వీబో యూజర్లకు చైనా అల్టిమేటం!


చైనా మైక్రో బ్లాగింగ్ సైట్ వీబో యూజర్లకు ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. వారం రోజుల్లో అసలు పేర్లతో తమ ఖాతాలకు అనుసంధానం కావాలని హెచ్చరికలు జారీ చేసింది. ఊరు, పేరు లేకుండా అవుతున్న పోస్టింగులు, సంభాషణలపై కొరడా ఝళిపించనున్నట్టు చైనా సైబర్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ ప్రకటించింది. అక్టోబరు నుంచి ఇటువంటి పోస్టులను నిలిపివేయనున్నట్టు హెచ్చరించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తాజా హెచ్చరికలు జారీ చేసింది. టెక్ కంపెనీలన్నీ తమ ఖాతాదారుల అసలు పేర్లను గుర్తించాలని ఆదేశాలు జారీ చేసింది.  

చైనాకు చెందిన పాప్యులర్ మైక్రో బ్లాగింగ్ సైట్ అయిన వీబోకు 34 కోట్ల మంది వినియోగదారులున్నారు. వీబో చైనాలో ట్విట్టర్ లాంటి పాత్రను పోషిస్తోంది. అయితే ప్రభుత్వ తాజా ఆదేశాలతో తమ ఖాతాదారులు గణనీయంగా తగ్గే ప్రమాదం ఉందని వీబో ఆందోళన వ్యక్తం చేస్తోంది.

  • Loading...

More Telugu News