: 3500 ఏళ్లనాటి సమాధిని కనుగొన్న పురావస్తు శాస్త్రవేత్తలు.. రాజకుటుంబ స్వర్ణకారుడిదిగా గుర్తింపు!
ఈజిప్టులోని పురాతత్వ శాస్త్రవేత్తలు అరుదైన సమాధిని కనుగొన్నారు. 3500 ఏళ్ల క్రితం నివసించినట్టుగా భావిస్తున్న రాజకుటుంబ స్వర్ణకారుడి సమాధిని గుర్తించి పరిశోధనలు ప్రారంభించారు. ఆయన లగ్జర్ నగరంలో నివసించినట్టు చెబుతున్నారు. పరిశోధకులు సమాధిలో కొన్ని మమ్మీలు, కొన్ని శవపేటికలను గుర్తించారు. వీరు 21, 22 రాజవంశాలకు చెందిన వారిగా పేర్కొన్నారు. అలాగే చెక్కతో చెక్కిన 150 వరకు బొమ్మలను, సమాధిలో మట్టి, లైమ్‌స్టోన్‌ను కూడా గుర్తించినట్టు అధికారులు తెలిపారు.