: ఎలా ఉండకూడదో రోజాను, ఎలా ఉండాలో పురంధేశ్వరిని చూసి నేర్చుకోండి: ఏపీ మంత్రి మాణిక్యాలరావు
వైసీపీ ఎమ్మెల్యే రోజా, బీజేపీ నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరిల మధ్య ఉన్న తేడాను ఏపీ మంత్రి మాణిక్యాలరావు వివరించారు. తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఆదివారం నిర్వహించిన బీజేపీ కార్పొరేటర్ల ఆత్మీయ అభినందన సభకు ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి మాట్లాడుతూ రోజా, పురంధేశ్వరిలను చూసి నేర్చుకోవాల్సిన విషయాల గురించి వారికి వివరించారు.
ప్రజా సమస్యలపై స్పందించేటప్పుడు, బహిరంగ వేదికలపై ప్రసంగించేటప్పుడు భాష ఎలా ఉండకూడదో వైసీపీ నేత రోజాను చూసి నేర్చుకోవాలని, ఎలా మాట్లాడాలో పురంధేశ్వరిని చూసి నేర్చుకోవాలని సూచించారు. ఏదైనా ఒక విషయం గురించి మాట్లాడే ముందు ఆలోచించాలని, ఆవేశంలో నోరు జారడం మంచిది కాదని మంత్రి పేర్కొన్నారు.