: మూడు నెలల తర్వాత తొలిసారి.. నేటి పెట్రో ధరల్లో కనిపించని మార్పు!
చమురు ధరల సమీక్ష మొదలైన మూడు నెలల తర్వాత తొలిసారి పెట్రోలు, డీజిల్ ధరల్లో నేడు (సోమవారం) మార్పు కనిపించలేదు. ధరల సమీక్ష మొదలైన తర్వాత రోజూ చమురు ధరల్లో మార్పు కనిపించేది. రోజూ ఎంతో కొంత పెరగడం, కానీ తగ్గడం కానీ ఉండేది. తొలిసారిగా నిన్నటి ధరలు నేడు కూడా స్థిరంగా ఉన్నాయి. ఇలా జరగడం ఈ మూడు నెలల్లో ఇదే తొలిసారి. పెట్రోలు లీటర్ ధర రూ.74.30 కాగా, డీజిల్ ధర రూ.63.41గా ఉంది.