: పావురానికి టికెట్ తీసుకోలేదని కండక్టర్ కు మెమో జారీ చేసిన అధికారి!


పావురానికి టికెట్ తీసుకోలేదని కండక్టర్ కు చెకింగ్ ఆఫీసర్ మెమో ఇచ్చిన ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. ఘటన వివరాల్లోకి వెళ్తే...తమిళనాడులోని ధర్మపురి జిల్లాలో ఉన్న హరూర్‌ టౌన్‌ బస్సులో ఓ వ్యక్తి పావురంతో కలిసి ప్రయాణించాడు. మార్గమధ్యంలో తనిఖీ అధికారులు బస్సెక్కి తనిఖీలు నిర్వహించారు. బస్సులో అందరూ టికెట్ తీసుకున్నారు. పావురంతో ప్రయాణించిన వ్యక్తి ఆ పావురానికి టికెట్ తీసుకోలేదు.

దీనిని గుర్తించిన అధికారి, కండక్టర్ ను నిలదీశారు. అయితే అతను బస్సెక్కేటప్పుడు అతని చేతిలో పావురం లేదని ఆయన సమాధానం ఇచ్చారు. దీంతో మరింత ఆగ్రహానికి గురైన అధికారి, కండక్టర్ కు మెమో జారీ చేశారు. దీంతో ఆ కండెక్టర్ 'ఇదెక్కడి చోద్యంరా బాబూ' అనుకుంటున్నాడు. 

  • Loading...

More Telugu News