: 'నీ స్వరమే కాదు.. నువ్వూ చాలా మధురం..' అంటూ గాయని, డబ్బింగ్ ఆర్టిస్టు చిన్మయికి విషెస్!
ప్రముఖ గాయిని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి శ్రీపాద పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. సామాజిక మాధ్యమాల వేదికగా ఆమెకు ఆమె భర్త, నటుడు రాహుల్ రవీంద్రన్.. ‘నా ప్రేమకు పుట్టినరోజు శుభాకాంక్షలు’ అంటూ విషెస్ చెప్పాడు.
‘శుభాకాంక్షలు చిన్మయి, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా’ అంటూ ప్రముఖ హీరోయిన్ సమంత, ‘నీ స్వరం మాత్రమే మధురం కాదు. నువ్వు కూడా చాలా స్వీటెస్ట్.. పుట్టినరోజు శుభాకాంక్షలు చిన్మయి..’అని రకుల్ ప్రీత్ సింగ్, ‘హ్యాపీ బర్త్ డే బ్యూటిఫుల్’ అని లావణ్య త్రిపాఠి శుభాకాంక్షలు తెలిపారు. కాగా, దక్షిణాది భాషల్లోనే కాకుండా, ఇతర భాషల్లో కూడా పలు హిట్ సాంగ్స్ చిన్మయి ఆలపించారు.