: నేను మాత్రం ‘రైటింగ్’ నే నమ్ముకున్నాను!: ‘హైపర్’ ఆది


తన వయసు ప్రస్తుతం ఇరవై ఐదేళ్లని, ఇరవై ఏడు రాగానే పెళ్లి చేసుకుంటానని ‘జబర్దస్త్’ నటుడు ‘హైపర్’ ఆది చెప్పాడు. ఓ ఇంటర్వ్యూలో ఆది మాట్లాడుతూ, ఇంట్లో వాళ్లు చూసిన పెళ్లి సంబంధమే చేసుకుంటానని చెప్పాడు. ‘నటుడికి ఈ ఫీల్డ్ లో అవకాశాలు రాకపోవడం వంటి అంశాలు ఉంటాయి. కానీ, నేను మాత్రం ‘రైటింగ్’ నే నమ్ముకున్నాను. అది ఉన్నంత కాలం ఈ ఫీల్డ్ లో ఇబ్బందిలేదు. ఎందుకంటే, వందకోట్లతో సినిమా తీయాలన్నా పేపర్ మీద స్క్రిప్ట్ ఉండాలి. అది లేకపోతే, సినిమా తీయలేరు. నేను కేవలం కామెడీ స్క్రిప్ట్ లే రాస్తున్నాను. వేరే ఎమోషన్స్ కు సంబంధించిన స్క్రిప్ట్స్ ను నేను అంతగా రాయలేనేమో!  అర్జున్ రెడ్డి మూవీ రెండుసార్లు చూశాను. సూపర్. ఈ రోజు ప్రతి సినిమాకు పబ్లిసిటీ చేయాల్సిన అవసరం ఎంతో ఉందని. పబ్లిసిటీ స్టంట్ చేసే విషయంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ నెంబర్ వన్. ఎందుకంటే, ఆయన సినిమా టైటిల్ నుంచే పబ్లిసిటీ స్టంట్ కనపడుతూ ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు.

  • Loading...

More Telugu News