: భారత్ లో నైతికతే చట్టబద్ధమైన అంశంగా ఉనికిలో ఉంది: మోహన్ భగవత్


మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి డెబ్భై ఏళ్లు అయినా దేశీయ పరిస్థితులు, సంప్రదాయాల స్ఫూర్తితో చట్టాలు రూపొందడం లేదని, భారత్ లో నైతికతే చట్టబద్ధమైన అంశంగా ఉనికిలో ఉందని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ అన్నారు. హైదరాబాద్ లోని సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో అఖిల భారతీయ అధివక్త పరిషత్ సిల్వర్ జూబ్లీ వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఆయన పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రామమందిర నిర్మాణ ఉద్యమం సమయంలోనే, అఖిల భారతీయ ఆధివక్త పరిషత్ ఏర్పడిందని అన్నారు. వివిధ దేశాలు తమ క్షేత్రస్థాయి పరిస్థితులు, అనుభవాల ఆధారంగా చట్టాలు తయారు చేసుకుంటున్నాయని, ఆ చట్టాలు మనకు ఆదర్శం కాబోవని అన్నారు. ఆచారవ్యవహారాలు, విలువలపై ఆధారపడి సమాజం నడుస్తోందని, సమాజంలో విలువల ఆధారంగా పరివర్తన తీసుకురావడం కోసం న్యాయవాదులు కృషి చేయాలని ఈ సందర్భంగా మోహన్ భగవత్ సూచించారు.

  • Loading...

More Telugu News