: సీనియర్ కన్నడ నటి బి.వి. రాధ మృతి!
కన్నడ సీనియర్ నటి బి.వి. రాధ(70) ఈ రోజు కన్నుమూశారు. బెంగళూరులో ఈ రోజు ఉదయం ఆమె గుండెపోటుతో మృతి చెందినట్టు ఆమె కుటుంబసభ్యులు తెలిపారు. ఆమె దక్షిణాదిలో దాదాపు 300 చిత్రాల్లో నటించారు. కాగా, 1964లో ‘నవకోటి నారాయణ’ అనే కన్నడ చిత్రం ద్వారా ఆమె చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాత తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు చిత్రాలలో నటించి గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వరరావు, తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేశన్ తదితరులతో కలిసి నటించిన ఆమె, పలు చిత్రాలకు నిర్మాతగా కూడా వ్యవహరించారు.