: ‘అర్జున్ రెడ్డి’ సినిమా అద్భుతం అన్న రామ్ చరణ్!


‘అర్జున్ రెడ్డి’ సినిమాపై ఇప్పటికే సినీ రంగ ప్రముఖులు పలువురు తమ అభిప్రాయాలను, ప్రశంసలను వ్యక్తం చేసిన విషయం విదితమే. తాజాగా, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ ప్రశంసలు కురిపించాడు. ‘అర్జున్ రెడ్డి’ సినిమా చూశానని, యథార్థంగా, వాస్తవికంగా, నివ్వెరపోయేలా ఈ చిత్రం రూపొందించారని ప్రశంసించారు. ఈ చిత్ర దర్శకుడు సందీప్ వంగా, హీరో విజయ్ దేవరకొండ, షాలిని పాండే, రాహుల్ రామకృష్ణ కు, యావత్తు చిత్ర యూనిట్ కు ఈ సందర్బంగా రామ్ చరణ్ అభినందనలు తెలిపారు. కాగా, దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘రంగస్థలం 1985’ చిత్రంలో రామ్ చరణ్ నటిస్తున్నాడు.

  • Loading...

More Telugu News