: హైదరాబాద్ మెట్రో రైల్ పనులలోని క్రేన్ తగిలి ప్రాణాలు కోల్పోయిన యువతి


హైద‌రాబాద్‌లోని కూక‌ట్‌ప‌ల్లిలో మెట్రో స్టేష‌న్ వ‌ద్ద ప్ర‌మాదం సంభ‌వించింది. మెట్రో ప‌నులు చేస్తోన్న క్రమంలో క్రేన్ ఓ యువ‌తికి బ‌లంగా త‌గ‌ల‌డంతో ఆమె అక్క‌డే కుప్ప‌కూలిపోయింది. తీవ్ర‌గాయాల పాలై ర‌క్త‌మోడుతున్న ఆమెను మెట్రో సిబ్బంది ఆసుపత్రికి త‌ర‌లించారు. అయితే, మార్గ‌మధ్యంలోనే ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున‌ మెట్రో ప‌నులు జ‌రుగుతోన్న నేప‌థ్యంలో ప‌లు మార్గాల్లో వాహ‌నాలు వెళ్లే రూట్ల‌ను మార్చారు. సికింద్రాబాద్ రైతి ఫైల్ బ‌స్టాండ్ వ‌ద్ద‌, ఎస్సార్ న‌గ‌ర్ నుంచి అమీర్ పేట్ మైత్రివ‌నం వ‌ర‌కు రూట్ల‌ను మార్చి ప‌నులు కొనసాగిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లోనూ క్రేన్ల సాయంతో పనులు కొనసాగిస్తున్నారు. మెట్రో ప‌నులు జ‌రుగుతోన్న నేప‌థ్యంలో ఆయా ప్రాంతాల్లో హెచ్చ‌రిక బోర్డుల‌ను కూడా ఏర్పాటు చేశారు. 

  • Loading...

More Telugu News