: నిన్న భారీగా పెరిగి ఈ రోజు అదే స్థాయిలో పడిపోయిన బంగారం ధర!
నిన్న ఏకంగా 990 రూపాయలు పెరిగిపోయిన పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర ఈ రోజు ఒక్కసారిగా రూ. 820 తగ్గింది. అంతర్జాతీయంగా బలహీన సంకేతాలు, స్థానిక వ్యాపారుల నుంచి కొనుగోళ్లు తగ్గడంతో బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర ఈ రోజు రూ.30,530గా నమోదైంది. ఇంత భారీగా ధర తగ్గడం ఈ ఏడాదిలో ఇదే మొదటిసారని విశ్లేషకులు చెబుతున్నారు. మరోవైపు నిన్నటితో పోల్చితే వెండి ధరలో మాత్రం ఏ మార్పూ లేదు. దేశీయ మార్కెట్లో కిలో వెండి ధర రూ. 42 వేలుగా నమోదైంది.