: శిక్షణ శిబిరం నుంచి అలిగి వెళ్లిపోయిన అంజన్ కుమార్ యాదవ్.. కోమటిరెడ్డి బ్రదర్స్ కూడా!


హైదరాబాద్ లోని శంషాబాద్ లో జరుగుతున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల శిక్షణ శిబిరంలో రసాభాస చోటు చేసుకుంది. శిబిరంలో కోమటిరెడ్డి బ్రదర్స్ వెంకటరెడ్డి, రాజగోపాల్ రెడ్డిల అనుచరులు పలు నినాదాలు చేశారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రసంగిస్తుండగా వీరు వ్యతిరేక నినాదాలు చేశారు. ఆ సమయంలో కోమటిరెడ్డి బ్రదర్స్ తమ అనుచరులను వారించే ప్రయత్నం కూడా చేయలేదు. ఆ తర్వాత వారు అక్కడ నుంచి వెళ్లిపోయారు. అంతకు ముందు వారు మీడియాతో మాట్లాడుతూ, తమను వేదికపైకి ఆహ్వానించలేదని... అందుకే వెళ్లిపోతున్నామని చెప్పారు. మరోవైపు సికింద్రాబాద్ మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ కూడా శిబిరం నుంచి అలిగి వెళ్లిపోయారు. శిక్షణ శిబిరంలో తనను సరిగా పట్టించుకోలేదని ఆయన చిర్రుబుర్రులాడారు.

  • Loading...

More Telugu News