: రోడ్డు పక్కన ఆగి ఉన్న కారు వల్ల సైకిల్ రేస్‌లో గందరగోళం... వీడియో చూడండి!
సైకిల్ రేస్ జరుగుతుండగా ట్రాక్ మీద ఓ పక్కకు పార్క్ చేసి ఉన్న కారు వల్ల రేస్ మొత్తం గందరగోళంగా మారింది. బ్రిటన్‌లో జరుగుతున్న టూర్ ఆఫ్ బ్రిటన్ సైకిల్ పోటీలో ఈ ఘటన జరిగింది. ముందు వచ్చిన సైకిళ్లు కారును గుర్తించి తప్పించుకోగలిగాయి. కానీ ఒక్క సైకిల్ కారుకు గుద్దుకోవడంతో ఆ వెనకాలే సైకిళ్లన్నీ వరుసగా పడిపోయాయి. ఏం జరిగిందో అంచనా వేసేలోపే దాదాపు 15 మంది సైకిల్ రేస్ ఆటగాళ్లు కింద పడిపోయారు. వారిలో కొంత మందికి స్వల్పంగా గాయాలు కూడా అయ్యాయి.