: జాతీయ అవార్డును అందుకున్న మంత్రి కేటీఆర్
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మరో జాతీయ అవార్డును అందుకున్నారు. ఐటీ మినిస్టర్ ఆఫ్ ది ఇయర్ అవార్డుతో ప్రముఖ సంస్థ స్కోచ్ కేటీఆర్ ను సన్మానించింది. 49వ స్కోచ్ సమ్మిట్ సందర్భంగా ఢిల్లీలో ఈరోజు ఆయన అవార్డును అందుకున్నారు. ఐటీ రంగంలో తెలంగాణను ముందుకు తీసుకెళుతున్నందుకు గుర్తింపుగా ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, బ్రాడ్ బ్యాండ్ సేవలను ఇంటింటికీ అందిస్తున్న తొలి రాష్ట్రం తెలంగాణ అని చెప్పడానికి గర్విస్తున్నానని చెప్పారు. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగు నీటిని అందించడమే కాకుండా, ఇంటర్నెట్ సేవలను కూడా అందిస్తున్నామని తెలిపారు.