: బైరెడ్డి టీడీపీలో చేరిక వార్తలపై కేఈ కృష్ణమూర్తి స్పందన


ప్రత్యేక రాయలసీమ నినాదంతో సొంత కుంపటి పెట్టుకున్న బైరెడ్డి రాజశేఖరరెడ్డి... ఉద్యమాన్ని ముగిస్తున్నానని ప్రకటించిన సంగతి తెలిసిందే. తనకు ప్రాధాన్యత ఇచ్చే పార్టీలో చేరుతానని ఆయన ప్రకటించారు. దీంతో ఆయన మళ్లీ టీడీపీ గూటికే చేరుకుంటారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కర్నూలు జిల్లాకే చెందిన డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి బైరెడ్డి టీడీపీలో చేరే అంశంపై స్పందించారు.

టీడీపీ సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానిస్తామని ఆయన చెప్పారు. పెద్ద నాయకుల నుంచి కార్యకర్తల వరకు అందరికీ స్వాగతం పలుకుతామని అన్నారు. బైరెడ్డి ఇంతకు ముందు టీడీపీలోనే ఉన్నారని... ఆయనను మళ్లీ పార్టీలోకి తీసుకోవాలని తమ అధినేత చంద్రబాబు నిర్ణయిస్తే, తాము తప్పకుండా ఆయన నిర్ణయాన్ని స్వాగతిస్తామని చెప్పారు. కర్నూలు జిల్లాలో జరిగిన ముఖ్యమంత్రి కార్యక్రమానికి అనారోగ్య కారణాల వల్లే తాను హాజరుకాలేకపోయానని వెల్లడించారు.

  • Loading...

More Telugu News