: 'భార్యను కొట్టాను, జైల్లో పెట్టండి' అన్నాడు... కౌన్సిలింగ్ ఇచ్చిన ఏసీపీ ముఖం పగులగొట్టాడు!


రాజస్థాన్‌ లోని జయపురలో చిత్రమైన ఘటన చోటుచేసుకుంది. జయపురలో యోగేష్ గోల్యా అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివసిస్తున్నాడు. భార్యతో వాగ్వాదం నేపథ్యంలో ఆమెను చితక్కొట్టిన ఆయన..నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి... ‘నా భార్యను కొట్టాను.నేను జైలుకు వెళ్లాలి. నన్ను అరెస్టు చేయండి’ అని పోలీసులను కోరాడు. ఇంతలో అతని చేతిలో దాడికి గురైన ఆయన భార్య కూడా అతనిపై కేసు పెట్టేందుకు స్టేషన్ కు చేరుకుంది. దీంతో వివాదం అర్ధం చేసుకున్న ఏసీపీ దేష్‌ రాజ్‌ యాదవ్‌ వారిద్దరినీ కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. దీంతో సదరు భర్తకి ఒళ్లు మండిపోయింది. జైలుకి పంపమంటే సర్దిచెబుతావా? అంటూ ఏసీపీపై గోల్యా దాడికి దిగాడు. అతని ముఖం పగిలేలా కొట్టాడు. దీంతో జైలుకి వెళ్లాలన్న అతని కోరికను పోలీసులు వెంటనే తీర్చారు. 

  • Loading...

More Telugu News