: ఉజ్జయిని జ్యోతిర్లింగం ఎందుకు కరుగుతోందో కనుక్కోవాలని సుప్రీంకోర్టు ఆదేశం!


ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన ఉజ్జయిని మహా కాళేశ్వర్ జ్యోతిర్లింగం కరిగిపోతున్నట్టు భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అభిషేక ప్రియుడైన భోళా శంకరుడికి భక్తులు ప్రతిరోజు పాలు, పెరుగు, తేనె, నీళ్లతో అభిషేకం చేస్తుంటారు. ఇలా ప్రతిరోజూ అభిషేకాలు చేయడం వల్లే లింగం కరిగిపోతున్నట్టు పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో జ్యోతిర్లింగం కరిగిపోతుండడం వెనక గల కారణాలను తెలుసుకోవాలంటూ అత్యున్నత న్యాయస్థానం ఓ నిపుణుల కమిటీని నియమించింది. దీంతో పురావస్తు శాఖ అధికారులు, భూగర్భ సర్వే శాఖ నిపుణులు ఆలయాన్ని సందర్శించి లింగాన్ని పరిశీలించారు. ఇందుకు సంబంధించిన నివేదికను వచ్చే వారం కోర్టుకు సమర్పించనున్నారు.

  • Loading...

More Telugu News