: కరీనా కపూర్ లేటెస్ట్ ఫొటో షూట్.. ఖుషీ అవుతోన్న అభిమానులు!
బాలీవుడ్ నటి కరీనా కపూర్‌కి సంబంధించిన కొత్త ఫొటోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఫిట్‌నెస్ గురించి ఎన్నో జాగ్రత్తలు తీసుకునే ఈ అమ్మడు తనకు పండంటి మగబిడ్డ జన్మించిన తర్వాత రోజూ జిమ్‌లో ఎక్స్‌ర్ సైజులు చేసి తిరిగి నాజూకుగా తయారైంది. ఇటీవల ‘ఫిల్మ్‌ఫేర్’ మ్యాగజైన్ కవర్ కోసం ఫొటో షూట్‌లో పాల్గొంది. ఈ ఫొటోలు ఆమె అభిమానులను అలరిస్తున్నాయి. ప్రస్తుతం కరీనా కపూర్ శశంకా ఘోష్ దర్శకత్వంలో ‘వీరయ్ ది వెడ్డింగ్’ సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ మొన్న ఢిల్లీలో ప్రారంభమైంది. కరీనా మళ్లీ సినిమాల్లో నటిస్తూ జోరు పెంచుతోందని ఆమె అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.