: కూతుర్ని కేంబ్రిడ్జ్ వర్శిటీలో చేర్చడానికి జగన్ లండన్ ప్రయాణం... అనుమతించిన సీబీఐ కోర్టు!
వైసీపీ అధినేత జగన్ మరో విదేశీ టూర్ కు రెడీ అవుతున్నారు. లండన్ వెళ్లేందుకు అనుమతించాలంటూ ఆయన పెట్టుకున్న పిటిషన్ పట్ల సీబీఐ కోర్టు సానుకూలంగా స్పందించింది. ఈ నెల 11వ తేదీ నుంచి 19వ తేదీ వరకు జగన్ విదేశీ పర్యటనకు కోర్టు అనుమతించింది. తన కుమార్తెను కేంబ్రిడ్జ్ యూనివర్శిటీలో చేర్పించేందుకు లండన్ కు జగన్ వెళుతున్నారు. ఇటీవలే ఆయన కోర్టు అనుమతితో న్యూజిలాండ్ పర్యటనకు కూడా వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.