: ఢిల్లీ మెట్రో రైల్‌లో ప్రయాణించిన తెలంగాణ మంత్రి కేటీఆర్
తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన పలు అంశాలపై ఢిల్లీ పెద్దలతో చర్చించడానికి వెళ్లిన ఆయన అక్కడి మెట్రోరైల్‌లో ప్రయాణించారు. ‘ఎంపీలు సీతారామ్ నాయక్, బాల్క సుమన్, రెసిడెంట్ కమిషనర్ అరవింద్ కుమార్‌తో ఢిల్లీ మెట్రో రైల్‌లో ప్రయాణం చేస్తున్నా’ అని తెలుపుతూ కేటీఆర్ ఇందుకు సంబంధించిన పలు ఫొటోలను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. అంతకు ముందు ఆయన ఇన్వెస్ట్ ఇండియా కార్యక్రమంలో పాల్గొని, తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను గురించి పలువురు ప్రముఖులకు వివరించారు.