: ఈ రోజు భారీగా పెరిగిపోయిన బంగారం ధర!
బంగారం ధర ఈ రోజు భారీగా పెరిగిపోయింది. నిన్న బంగారం ధర రూ.190 తగ్గి, పది గ్రాముల బంగారం ధర రూ.30,360 గా నమోదైన విషయం తెలిసిందే. అయితే, ఈ రోజు పసిడి ధర అమాంతం రూ.990 పెరిగిపోయింది. దీంతో ఢిల్లీ బులియన్ మార్కెట్లో పది గ్రాముల బంగారం ధర రూ.31, 350 కు చేరింది. మరోవైపు వెండి ధర కూడా కాస్త పెరిగింది. నిన్న రూ.41,900గా నమోదైన కిలో వెండి ధర ఈ రోజు రూ.100 పెరిగి రూ.42 వేలకు చేరింది.