: ఈ శబ్దాలు భరించలేకపోతున్నామంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన నటుడు అరవిందస్వామి


ఓ ఆలయానికి సంబంధించిన ఉత్సవ వేడుకల్లో బాణసంచా కాల్చడంపై సినీ నటుడు అరవిందస్వామి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరవిందస్వామి నివాసం ఉంటున్న తిరువాన్మియూర్ లోని ఇంటికి సమీపంలోని ఆలయంలో గత రెండు రోజులుగా ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారి ఊరేగింపును భక్తులు నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ ఎత్తున బాణసంచా కాల్చారు. ఆ శబ్దాల వల్ల తన కుటుంబసభ్యులు చాలా అసౌకర్యానికి గురవుతున్నారని ఆయన ఆన్ లైన్ ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, అక్కడకు వచ్చిన పోలీసులు బాణసంచా కాల్చరాదని సూచించారు. ఈ సందర్భంగా భక్తులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. ఆ తర్వాత పోలీసులు వారికి నచ్చజెప్పడంతో... బాణసంచా పేల్చకుండానే స్వామివారి ఊరేగింపును పూర్తి చేశారు.

  • Loading...

More Telugu News