: 8 దేశాలకు సునామీ హెచ్చరిక... అప్రమత్తమైన యూఎస్
మెక్సికోలో భూ ఉపరితలానికి సుమారు 35 కిలోమీటర్ల లోతులో సంభవించిన భూకంపం ప్రభావం ఇప్పుడిప్పుడే తెలుస్తోంది. దీని ప్రభావంతో సునామీ వచ్చే అవకాశం అధికంగా ఉండటంతో ఎనిమిది దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు. ఈ దేశాల్లోని తీర ప్రాంత ప్రజలు తక్షణం ఖాళీ చేసి సాధ్యమైనంత దూరంగా వెళ్లిపోవాలని అధికారులు ఆదేశించారు. మెక్సికోతో పాటు గ్వాటెమాలా, ఎల్ సాల్వడార్, కోస్టారికా, నికరాగ్వా, పనామా, హోండూరస్, ఈక్వెడార్ దేశాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. భూకంపం ప్రభావంతో మెక్సికోలో వందలాది భవనాలు బీటలు వారాయి. తొలి చిత్రాలను బట్టి పలు రహదార్లపై కూడా బీటలు వారాయి. అయితే, ప్రాణనష్టంపై వివరాలు అందాల్సి వుంది. అమెరికాలోని తీర ప్రాంతాలకూ సునామీ ముప్పు ఉందని హెచ్చరికలు అందడంతో, యూఎస్ యంత్రాంగం అప్రమత్తమైంది.