: సైనిక చర్య జరగదని అనుకుంటున్నారా?... నార్త్ కొరియా బాధపడే రోజు వస్తుంది: ట్రంప్ కీలక వ్యాఖ్య


ఉత్తర కొరియాపై సైనిక చర్యకు దిగరాదన్నది తన అభిమతమని, అయితే, ఏది జరుగుతుంది, ఏది జరగదు అన్నది స్పష్టంగా చెప్పలేని పరిస్థితిలో ఉన్నామని, అయితే, ఉత్తర కొరియా బాధపడే రోజు దగ్గర్లోనే ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. వాషింగ్టన్ లో మీడియాతో మాట్లాడిన ఆయన, ఉత్తర కొరియా నుంచి అణు మిసైల్ ప్రమాదం అమెరికాకు పొంచి వుందన్న భయం లేదని, అయితే, ఏదైనా జరిగితే మాత్రం ప్యాంగ్యాంగ్ నాయకులు ఎంతో విచారిస్తారని ట్రంప్ హెచ్చరించారు.

 ఉత్తర కొరియా ఆరో అణు పరీక్ష చేసిన విషయాన్ని ప్రస్తావించిన ఆయన, కొరియా నేత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని, దాన్ని తక్షణం నిలువరించాల్సి వుందని అన్నారు. తమ చివరి ఆప్షన్ సైనిక చర్యని అభివర్ణించారు. ఉత్తర కొరియాతో చర్చలు జరిపి వారిని దుందుడుకు వైఖరి నుంచి వెనక్కు మరల్చాలన్నది తన కోరికని, అందుకు ఆ దేశంతో సన్నిహితంగా ఉన్న ఇతర దేశాల సహకారాన్ని కోరానని చెప్పారు.

  • Loading...

More Telugu News