: బీజేపీ జనరల్ నాలెడ్జ్ పుస్తకంలో నెహ్రూ, మహాత్మాగాంధీల పేర్లు గల్లంతు!
జనరల్ నాలెడ్జ్‌ను పెంచుకునేందుకు బీజేపీ విడుదల చేసిన పుస్తకంలో పలువురు ప్రముఖుల పేర్లు గల్లంతయ్యాయి. ‘ఫస్ట్ ఇన్ ఇండియా’ లిస్ట్‌లో దేశ తొలి ప్రధాని పండిట్ జవహర్‌లాల్ నెహ్రూ, ‘గ్రేట్ మ్యాన్’ లిస్ట్‌లో జాతిపిత మహాత్మాగాంధీ పేర్లు మిస్సయ్యాయి. అలాగే తొలి మహిళా ప్రధాని అయిన ఇందిరా గాంధీ పేరును కూడా ప్రచురించలేదు. అయితే భారత రత్న అందుకున్న తొలి మహిళగా మాత్రం ఇందిర పేరును పేర్కొన్నారు.
గాంధీల పేర్లను దేశ ప్రజల మనసుల నుంచి తొలగించేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ కావాలనే వారి పేర్లను విస్మరించిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇటువంటి పుస్తకాలతో పిల్లలకు ఏం నేర్పించాలని భావిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు. అయితే బీజేపీ మాత్రం ఈ విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి స్పందన వ్యక్తపరచలేదు.