: ప్రధాని నివాసం ముట్టడికి సిక్కు సంఘాల యత్నం


ఇందిరాగాంధీ హత్యానంతరం చెలరేగిన సిక్కు వ్యతిరేక అల్లర్ల కేసులో కాంగ్రెస్ నేత సజ్జన్ కుమార్ నిర్దోషిగా బయటపడడం పట్ల సిక్కు సంఘాల ఆగ్రహం ఇంకా చల్లారలేదు. నేడు ఢిల్లీలో పలు సిక్కు సంఘాల కార్యకర్తలు ప్రధాని మన్మోహన్ నివాసాన్ని ముట్టడించేందుకు యత్నించారు. జంతర్ మంతర్ వద్ద నుంచి బయల్దేరిన ఆందోళనకారులను పార్లమెంటు స్ట్రీట్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. సిక్కు సంఘాల నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సజ్జన్ కుమార్ కు విముక్తి లభించడంపై పంజాబ్ లోనూ నిరసనలు వెల్లువెత్తాయి. నేడు పంజాబ్ వ్యాప్తంగా రైల్ రోకో నిర్వహించారు.

  • Loading...

More Telugu News