: తెహల్కా మాజీ ఎడిటర్ తేజ్‌పాల్‌ చుట్టూ బిగుస్తున్న ఉచ్చు.. అత్యాచారయత్నం కేసులో దోషిగా తేలితే జీవితకాల శిక్ష!


సంచలన మ్యాగజైన్ తెహల్కా మాజీ ఎడిటర్ తేజ్‌పాల్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సహోద్యోగిపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆరోపణలపై ఈనెల 28 నుంచి విచారణ ప్రారంభమవుతుందని గోవా కోర్టు తెలిపింది. తెహల్కా మాజీ ఫౌండర్-ఎడిటర్ అయిన తేజ్‌పాల్ తన జూనియర్‌ను లైంగికంగా వేధించినట్టు ఆరోపణలున్నాయి. నవంబరు, 2013లో గోవాలో నిర్వహించిన మ్యాగజైన్ ‘థింక్ 2013’ ఫెస్టివల్‌లో మహిళా సహోద్యోగిని తేజ్‌పాల్ లిఫ్ట్‌లో వేధించినట్టు, దాడి చేసినట్టు అభియోగాలు నమోదయ్యాయి. తేజ్‌పాల్ ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించాడని, లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మపుసా కోర్టు పేర్కొంది. ఈనెల 28  నుంచి విచారణ ప్రారంభమవుతుందని తెలిపింది. ఈ కేసులో తేజ్‌పాల్ దోషిగా తేలితే 10 ఏళ్ల నుంచి జీవితకాల శిక్ష ఎదుర్కోవాల్సి ఉంటుంది.

  • Loading...

More Telugu News