: అమెరికాపై పగబట్టిన ప్రకృతి... నిన్న హార్వే, నేడు ఇర్మా, రేపు జోష్ తుపాన్!


అమెరికాపై ప్రకృతి పగబట్టినట్టు కనబడుతోంది. కరీబియన్ దీవులపై వరుసగా హరికేన్లు విరుచుకుపడుతున్నాయి. నిన్న హార్వే హరికేన్ బెంబేలెత్తిస్తే... నేడు ఇర్మా హరికేన్ అమెరికాను అతలాకుతలం చేస్తోంది. ఇది వెళ్లగానే విరుచుకుపడేందుకు జోష్ హరికేన్ సిద్ధంగా ఉంది. 250 కిలోమీటర్ల వేగంతో దూసుకొచ్చిన ఇర్మా హరికేన్ టెక్సాస్ తదితర ప్రాంతాల్లో ఇప్పటికే భారీ నష్టాన్ని కలుగజేసిన సంగతి తెలిసిందే.

ఇర్మా ధాటికి ఇళ్లు గాల్లో తేలుతుండగా, బేస్ మెంట్లలో పలువురు తలదాచుకుంటున్నారు. అలాంటి వారిని అక్కడ ఉండనివ్వకుండా హోరువాన బెంబేలెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో అమెరికాలో టెక్సాస్ వాసుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. ఈ క్రమంలో కరీబియన్ దీవుల దిశగా జోష్ హరికేన్ వేగంగా దూసుకొస్తోందని, హార్వే హరికేన్ ముగియగానే అమెరికాను జోష్ తాకుతుందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. 

  • Loading...

More Telugu News