: 21 వేల మంది నల్లబాబులు.. రూ.4900 కోట్లు ప్రకటించారు!
గతేడాది నవంబరులో పెద్ద నోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం ప్రకటించిన ప్రధాన్ మంత్రి గరీబ్ కల్యాణ్ యోజన (పీఎంజీకేవై)కి స్పందన అంతంత మాత్రంగానే ఉంది. నల్లకుబేరులు తమ వద్ద ఉన్న నల్లధనాన్ని వెల్లడించేందుకు ప్రభుత్వం ఈ స్కీమ్ రూపంలో ఆఖరి అవకాశాన్ని ఇచ్చింది. అయితే పీఎంజీకేవైకి అనుకున్నంత స్థాయిలో స్పందన రాలేదని ఆదాయపన్ను శాఖ అధికారి ఒకరు తెలిపిన వివరాలను బట్టి తెలుస్తోంది. ఈ పథకంలో భాగంగా ఇప్పటి వరకు 21వేల మంది రూ.4900 కోట్ల నల్లధనాన్ని ప్రకటించారు. వీరి నుంచి రూ.2451 వసూలు చేశారు.
పీఎంజీకేవైలో ప్రకటించిన నల్లధనంలో 50 శాతాన్ని జరిమానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. మరో 25 శాతాన్ని ప్రభుత్వం నాలుగేళ్ల వరకు తన వద్ద ఉంచుకుంటుంది. దీనికి ఎటువంటి వడ్డీ ఉండదు. మిగిలిన 25 శాతం నల్లధనం వైట్ అయిపోయినట్టే. ఇదీ ఈ పథకం ఉద్దేశం. అయితే ఈ పథకానికి అనుకున్నంత స్పందన రాలేదని రెవెన్యూ కార్యదర్శి హస్ముఖ్ అధియా పేర్కొన్నారు.