: కుప్పంలో చంద్రబాబుని, పులివెందులలో జగన్ ని.. గుడివాడలో నన్ను ఎవరూ ఓడించలేరు!: కొడాలి నాని
గుడివాడలో తనను ఓడించడం ఎవరి తరం కాదంటూ వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని వ్యాఖ్యానించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, కుప్పంలో చంద్రబాబుని, పులివెందులలో జగన్ ని, సిద్దిపేటలో హరీష్ రావుని, గుడివాడలో తనను ఎవరూ ఓడించలేరని అన్నారు. ఈ నాలుగు స్థానాల్లో ఎప్పటీకి తామే గెలుస్తామని చెప్పారు. కాగా, నంద్యాల ఉపఎన్నికల్లో, కాకినాడ కార్పొరేషన్ ఎన్నికల్లో టీడీపీ విజయ ఢంకా మోగించిన అనంతరం, కొడాలి నానిపై టీడీపీ నేతలు విమర్శలు గుప్పించారు. కొడాలి నాని తన పదవికి రాజీనామా చేస్తే, తమ పార్టీ కార్యకర్తను నిలబెట్టినా కూడా మంచి మెజార్టీతో విజయం సాధిస్తాడని టీడీపీ నేతలు ఇటీవల వ్యాఖ్యానించడం విదితమే.