: అవసరమైతే మరిన్ని సర్జికల్ దాడులకు వెనుకాడం: ఆర్మీ


పాక్ సరిహద్దులోని నియంత్రణ రేఖ వద్ద ప్రస్తుతం ప్రశాంతమైన పరిస్థితే ఉందని... ఆందోళన చెందాల్సిన అవసరం లేదని నార్తర్న్ కమాండ్ లెఫ్టినెంట్ జనరల్ దేవ్ రాజ్ అన్బు తెలిపారు. నియంత్రణ రేఖ అనేది కేవలం ఊహాజనితమైన రేఖ మాత్రమేనని... అవసరమైతే దాన్ని దాటి వెళతామని, సర్జికల్ దాడులు చేస్తామని చెప్పారు. ఎల్ఓసీ వద్ద ఉగ్రవాదుల కదలికలు పెరిగినప్పటికీ, వారిని దేశంలోకి మాత్రం రానివ్వడం లేదని తెలిపారు. జమ్ముకశ్మీర్ లో ఉన్న వేర్పాటువాదులకు నిధులు రాకుండా ఎన్ఐఏ కట్టుదిట్టం చేసిందని... దీంతో, అక్కడి ఆందోళనల్లో యువత పాల్గొనడం లేదని చెప్పారు. 

  • Loading...

More Telugu News