: బిడ్డ మరణానికి డాక్టర్ల గొడవ కారణం కాదు... స్పష్టం చేసిన విచారణ కమిటీ
ఇటీవల జోధ్‌పూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యక్తిగత గొడవల కారణంగా ఆపరేషన్ చేస్తుండగా ఒకర్నొకరు తిట్టుకుంటూ డాక్టర్లు గొడవ పడిన సంగతి తెలిసిందే. ఆ గొడవ కారణంగా ఆపరేషన్ మీద శ్రద్ధ పెట్టకపోవడంతో పుట్టిన బిడ్డ మరణించిందని కూడా వార్తలు వచ్చాయి. అయితే వారి గొడవ కారణంగా బిడ్డ చనిపోలేదని ఈ కేసు విచారణ కోసం రాజస్థాన్ హైకోర్టు నియమించిన విచారణ కమిటీ స్పష్టం చేసింది. తన తొమ్మిది పేజీల నివేదికను కమిటీ హైకోర్టుకి అందజేసింది. వీడియో తీసిన డాక్టర్‌పై చర్యలకు విచారణ కమిటీ సిఫార్సు చేయకపోయినప్పటికీ, ఆపరేషన్ థియేటర్లోకి సెల్‌ఫోన్ తీసుకెళ్లడంపై ఆ మహిళ డాక్టర్‌ను హైకోర్టు హెచ్చరించింది.