: ‘బ్లూవేల్’ గేమ్ ఆడి, నిద్రమాత్రలు మింగి.. రెండోసారి ఆత్మహత్యాయత్నం చేసిన అమ్మాయి!
భారత్‌లో బ్లూవేల్ గేమ్ విజృంభిస్తోంది. ఈ ఆన్‌లైన్ గేమ్ బారినపడి ప్రాణాలు తీసుకుంటున్న ఘటనలు ప్రతిరోజూ వెలుగులోకి వస్తున్నప్పటికీ దాని బారిన పడుతోన్న వారి సంఖ్య పెరిగిపోతూనే ఉంది. ఇటీవలే రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో ఓ బీఎస్ఎఫ్ జవాను కుమార్తె (17) సరస్సులో దూకి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఆమెను పోలీసులు స్థానికుల సాయంతో కాపాడారు. అయితే, ఆమె మరోసారి ఆత్మహత్యాయత్నం చేసింది. ఇంట్లో ఆమె నిద్రమాత్రలు మింగింది. ఈ విషయాన్ని గుర్తించిన ఆమె తల్లిదండ్రులు ఆమెను ఆసుపత్రిలో చేర్పించారు. ఆమె చేతిపై బ్లూవేల్ బొమ్మ ఉంది. ఇటీవలే ఆమె మీడియాతో మాట్లాడుతూ బ్లూ వేల్ గేమ్‌లో చివరి టాస్క్ పూర్తి చేయకపోతే తన తల్లి చచ్చిపోతుందని వ్యాఖ్యలు చేసింది.