: మంత్రి కుమార్తెకు విదేశీ స్కాలర్ షిప్ ఇచ్చిన ఫడ్నవీస్ సర్కారు... తీవ్ర విమర్శలు


విదేశాల్లో హయ్యర్ ఎడ్యుకేషన్ అభ్యసించే ఎస్సీ విద్యార్థులకు ప్రభుత్వం అందించే స్కాలర్ షిప్ లు పక్కదారి పడుతున్నాయని మహారాష్ట్రలో విమర్శలు పెరుగుతున్నాయి. తాజాగా రాష్ట్ర సామాజిక న్యాయ శాఖ మంత్రి రాజ్ కుమార్ బాదోల్ కుమార్తె శృతికి యూకేలోని మాంచెస్టర్ వర్శిటీలో పీహెచ్డీ చదివేందుకు ప్రభుత్వం స్కాలర్ షిప్ ను ప్రకటించింది. ఆమెతో పాటు ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారుల కుమారులకు కూడా ఈ ప్రోత్సాహకాలు లభించాయి. మొత్తం 35 మంది పేర్లను ఫడ్నవీస్ సర్కారు ఎంపిక చేయగా, ఇందులో మంత్రి, ఐఏఎస్ ల పిల్లలు ఉండటంపై విమర్శలు వస్తున్నాయి.

ఇక వీటిపై స్పందించిన రాజ్ కుమార్, తన కుమార్తె నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకుందని, సెలక్షన్ కమిటీలో తాను లేనని అంటుండటం గమనార్హం. ఆమె అప్లికేషన్ ను పరిశీలించిన మీదటే ఎంపిక జరిగిందని, దీని గురించి ముందే సీఎంకు చెప్పామని అన్నారు. అయితే, స్కాలర్ షిప్ ను తీసుకోవాలా? వద్దా? అన్న విషయమై నిర్ణయం తీసుకోలేదని చెప్పారు.

  • Loading...

More Telugu News