: రిఫరీ పొరపాటు.. టాస్ గెలిచింది ఇండియా కాదు!
శ్రీలంకతో నిన్న జరిగిన ఏకైక టీ20 మ్యాచ్ లో పెద్ద పొరపాటు చోటు చేసుకుంది. శ్రీలంక కెప్టెన్ ఉపుల్ తరంగ టాస్ గెలిస్తే... పొరపాటున టీమిండియా కెప్టెన్ కోహ్లీ గెలిచినట్టు రిఫరీ ప్రకటించాడు. ఉపుల్ తరంగ కాయిన్ ను గాల్లోకి ఎగురవేశాడు. కోహ్లీ హెడ్స్ ను ఎంచుకున్నాడు. కిందపడ్డ కాయిన్ వద్దకు వెళ్లిన రిఫరీ టైల్స్ పడిందని చెప్పాడు. వెనువెంటనే వ్యాఖ్యాతగా ఉన్న మురళీకార్తీక్ ఇండియా టాస్ గెలిచినట్టు ప్రకటించడం, ఆ తర్వాత కోహ్లీ బౌలింగ్ ఎంచుకోవడం జరిగిపోయాయి. చేసిన తప్పిదాన్ని గుర్తించిన రిఫరీ... అప్పటికే కోహ్లీ టాస్ గెలిచినట్టు ప్రకటించడంతో, ఏమీ చేయలేకపోయాడు. అయితే, టాస్ గెలిస్తే తాను కూడా బౌలింగ్ నే ఎంచుకునేవాడినని ఉపుల్ తరంగ చెప్పిన సంగతి తెలిసిందే. ఇదే జరిగి ఉంటే... మ్యాచ్ ఎలాంటి మలుపులు తిరిగేదో!