: రోజర్ ఫెదరర్ కు పెను షాక్... యూఎస్ ఓపెన్ నుంచి అవుట్
స్విస్ దిగ్గజం, ఇటీవల వింబుల్డన్ చాంపియన్ షిప్ టోర్నీ విజేత రోజర్ ఫెదరర్ కు యూఎస్ ఓపెన్ లో షాక్ తగిలింది. కొద్దిసేపటి క్రితం ముగిసిన క్వార్టర్ ఫైనల్ పోరులో ఫెదరర్ ఓడిపోయాడు. ప్రత్యర్థి డెల్ పాట్రో చేతిలో 7-5, 3-6, 7-6, 6-4 తేడాతో ఫెదరర్ ఓటమి పాలయ్యాడు. తొలి సెట్ ను పోరాడి ఓడిన ఫెదరర్, రెండో సెట్ ను సునాయాసంగా గెలుచుకోగా, ఫెదరర్ ఫామ్ కొనసాగుతుందని అతని అభిమానులు భావించారు. అయితే, తనవైన ఫోర్ హ్యాండ్ షాట్లు, ఏస్ లతో విరుచుకుపడిన డెల్ పాట్రో, మూడు, నాలుగు సెట్లను గెలుచుకుని సెమీ ఫైనల్స్ లో కాలుమోపాడు. అనవసర తప్పిదాలు కూడా ఫెదరర్ ను పరాజయానికి దగ్గర చేశాయి.