: ఎంత దుర్మార్గుడు... తన గది నుంచి అమ్మాయిల గదిలోకి డేరా బాబా రహస్యమార్గం!
సిర్సాలోని గుర్మీత్ రామ్ రహీమ్ అలియాస్ డేరా బాబా ఆశ్రమంలో తనిఖీలు చేస్తున్న అధికారులు విస్తుపోయే నిజాలను వెలుగులోకి తెస్తున్నారు. ఆశ్రమంలో అమ్మాయిలు వుండే గదిలోని అల్మారాలో ఓ రహస్య తలుపును కనుగొన్నారు. అధికారులకు అనుమానం వచ్చి దీని తీగలాగితే డొంక మొత్తం కదిలింది. తన ఆశ్రమంలోని గుహ నుంచి అమ్మాయిల గదికి వెళ్లడానికి బాబా రహస్య మార్గాన్ని ఏర్పరచుకున్నాడని తేలింది. అమ్మాయిల గదిలోని అల్మారా తలుపు ద్వారా సరాసరి తన గుహకు వెళ్లగలిగేలా దీనిని ఏర్పాటు చేశారు. ఈ ఆశ్రమంలోని బాలికలను వారి వారి స్వస్థలాలకు పంపేసిన అధికారులు, తనిఖీలు చేస్తుండగా, ఈ రహస్య మార్గం కనిపించింది. ఇక అమ్మాయిల స్కూలు ఉన్న ఈ ప్రాంతంలోనే కొత్త డేరాను నిర్మించుకున్న గుర్మీత్, ఎక్కువ సమయం అక్కడే ఉండేవాడని కూడా అధికారులు తేల్చారు.