: భారత్-మయన్మార్ మధ్య ఐదు ‘బీ’ల బంధం.. వివరించిన ప్రధాని మోదీ!
మయన్మార్ పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్రమోదీ అక్కడి ప్రవాసులతో మాట్లాడుతూ ఇరు దేశాల బంధం వెనక ఉన్న ఐదు ‘బీ’ల బంధం గురించి వివరించారు. రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం కావడానికి ఈ ‘బీ’లు మరింత దోహదం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. బుద్ధిజం, బిజినెస్, బాలీవుడ్, భరతనాట్యం, బర్మా టేక్.. అంటూ ఆ ఐదు బీల గురించి వివరించారు. అయితే వీటిన్నింటి కంటే మరో ముఖ్యమైన ‘బీ’ భరోసా ఇరు దేశాల సంబంధాల మధ్య మిస్సవుతోందని తనదైన శైలిలో వివరించి ఆకట్టుకున్నారు.