: హైదరాబాదులో భార్య ఉండగా రెండో పెళ్లికి సిద్ధపడ్డ బిజినెస్ మన్...ఆటకట్టించిన పోలీసులు


హైదరాబాదులోని సంతోష్ నగర్ లో భార్యా, పిల్లలను మభ్య పెట్టి రెండో పెళ్లికి ఓ బిజినెస్ మన్ సిద్ధపడి, కటకటాల వెనక్కి వెళ్లడం కలకలం రేపింది. ఘటన వివరాల్లోకి వెళ్తే.. సంతోష్ నగర్ లో అన్వర్ వ్యాపారవేత్తగా స్థిరపడ్డారు. ఆయనకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే మొదటి భార్యకు తెలియకుండా వివాహం చేసుకోవాలని భావించిన అన్వర్ దానికి ఏర్పాట్లు కూడా పూర్తి చేశాడు. సంతోష్ నగర్ లోని షాన్ బాగ్ ప్యాలెస్ లో తన రెండో వివాహానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. నిఖా జరిగే సమయానికి వచ్చిన మొదటి భార్య, ప్రేమించి పెళ్లి చేసుకుని, ఇద్దరు పిల్లల్ని కన్న తరువాత తనను ఎందుకు మోసం చేస్తున్నావని ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. పోలీసులను చూసిన అన్వర్ పలాయనం చిత్తగించాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పరారైన అన్వర్ కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

  • Loading...

More Telugu News