: అడ్వైజరీ సంస్థపై రూ.వెయ్యి కోట్లకు పరువు నష్టం దావా వేసిన ఐటీసీ!


ఫాస్ట్ మూవింగ్ కన్జుమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) దిగ్గజం ఇండియన్ టొబాకో కార్పొరేషన్ (ఐటీసీ) లిమిటెడ్ ఓ అడ్వైజరీ సంస్థపై వెయ్యి కోట్ల రూపాయలకు కలకత్తా హైకోర్టులో పరువు నష్టం దావా వేసింది. ప్రోక్సీ అడ్వైజరీ సంస్థ అయిన ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ అడ్వైజరీ సర్వీసెస్ (ఐఐఏఎస్) తమ పరువుకు తీవ్ర నష్టం కలిగించిందని ఆరోపిస్తూ ఈ పిటిషన్ దాఖలు చేసింది. జూలై ఏడో తేదీన ఐఐఏఎస్ ప్రచురించిన నివేదికలో కంపెనీ డైరెక్టర్ల పరువుకు భంగం కలిగించే వ్యాఖ్యలు చేసిందని ఐటీసీ ఆరోపించింది. తమ పరువుకు తీవ్ర భంగం కలిగించేలా ఆర్టికల్ ప్రచురించినందుకు గాను రూ.1000 కోట్లతోపాటు చేసిన తప్పునకు బేషరతుగా క్షమాపణలు చెబుతూ మరో ఆర్టికల్‌ను ప్రచురించాల్సిందిగా ఐఐఏఎస్‌ను ఆదేశించాలని తన పిటిషన్‌లో కోర్టును కోరింది.

  • Loading...

More Telugu News