: రెండు గంటలు బ్యాటింగ్ చేసి.. 4 కేజీల బరువు తగ్గిన ఆసీస్ ఆటగాడు!


రెండు గంటల పాటు బ్యాటింగ్ చేసిన ఆసీస్ ఆటగాడు నాలుగు కేజీల బరువు తగ్గడం ఆసక్తి రేపుతోంది. భారత ఉపఖండంలోని దేశాలలో ఆసీస్, కివీస్, ఇంగ్లండ్ దేశాల క్రికెటర్లు మ్యాచ్ లు ఆడినప్పుడు ఉష్ణతాపానికి గురవుతుంటారు. దీంతో మ్యాచ్ సమయంలో తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు. ప్రస్తుతం ఆసీస్ జట్టు బంగ్లాదేశ్‌ లో పర్యటిస్తోంది. బంగ్లా వాతావరణానికి అలవాటు పడేందుకు ఆసీస్ ఆటగాళ్లు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. చిట్టగాంగ్ లో జరుగుతున్న రెండో టెస్టులో ఆసీస్ బ్యాట్స్ మన్ హ్యాండ్స్ కొంబ్ రెండున్నర గంటలు క్రీజులో నిలిచాడు. 113 బంతుల్లో 69 పరుగులు చేశాడు. వికెట్ కాపాడుకుంటూ సింగిల్స్ తీయడానికి ప్రాధాన్యమిచ్చిన హ్యాండ్స్ కోంబ్ నాలుగు కేజీల బరువు తగ్గాడు. అయితే ఎక్కువ సార్లు డ్రింక్స్ తీసుకోవడం ద్వారా శరీరంలో నీటి నిల్వ పడిపోకుండా జాగ్రత్త పడ్డాడు. మ్యాచ్ ముగియగానే ఐస్ బాత్ చేయడం విశేషం. 

  • Loading...

More Telugu News