: ఉప్పల్ లో మారణాయుధాలతో కాలనీలో డ్యాన్స్ వేస్తూ బెంబేలెత్తించిన యువకులు!
కొందరు యువకులు కత్తులతో తిరుగుతూ డ్యాన్స్ వేస్తూ కలకలం రేపిన ఘటన హైదరాబాద్ శివారులోని ఉప్పల్ లక్ష్మారెడ్డి కాలనీలో చోటుచేసుకుంది. అక్కడి గణేశ్ మండపానికి కొంత మంది యువకులు వచ్చారు. అందులో ఒకరి పుట్టినరోజు సందర్భంగా ఆ ప్రాంతంలోనే పండుగ చేసుకున్నారు. ఆ యువకులు మారణాయుధాలు పట్టుకుని చేస్తోన్న విన్యాసాలకు ఆ కాలనీ వాసులు బెంబేలెత్తిపోయి, రాచకొండ సీపీకి ఫొటోలు పంపారు. దీంతో వెంటనే అక్కడకు చేరుకున్న పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. ఆ మారణాయుధాలు వారి చేతికి ఎలా వచ్చాయన్న దానిపై దర్యాప్తు జరుపుతున్నారు.