: మనసులు దోచేస్తున్న జుకర్ బర్గ్ రెండో కూతురు ఫొటో
ఇటీవల ఫేస్‌బుక్ సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ భార్య ప్రిసిల్లా చాన్ రెండో కూతురికి జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. తన కూతురిని ఒళ్లో పట్టుకుని ఆడిస్తున్న ఫొటోను మార్క్ తన ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ముద్దులొలికే ఆ చిన్నారి ఫొటో నెటిజన్ల మనసును దోచేస్తోంది. ఇప్పటికే ఈ ఫొటోను 13,068 మంది షేర్ చేశారు. లైకుల సంఖ్య 1.2 మిలియన్లు దాటేసింది. ఇక కామెంట్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మార్క్ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న చాలా మంది కామెంట్ చేశారు. ఇప్పటికే మార్క్ దంపతులకు కూతురు మ్యాక్స్ ఉన్న సంగతి తెలిసిందే.