: కర్ణాటక ఎన్నికల్లో అపశృతులు
కర్ణాటక ఎన్నికల్లో అపశృతులు చోటు చేసుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేడు పోలింగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఓటు హక్కు వినియోగించుకునేందుకు బయల్దేరిన ఓ వ్యవసాయ కూలీని మృత్యువు గజరాజు రూపంలో కాలరాసింది. ముడిగెరే తాలూకాలో ఈ ఘటన జరిగింది. ఏనుగు ఆ వ్యక్తి తలను ఛిద్రం చేయడమే కాకుండా, మృతదేహంపై ఓ పెద్ద దుంగను కూడా విసిరేసి అడవిలోకి వెళ్ళిపోయింది.
ఈ ఘటనపై స్పందించిన డిప్యూటీ ఫారెస్ట్ కన్సర్వేటర్ రవిరాజ్ మరణించిన వ్యక్తి కుటుంబానికి రూ. 5 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. ఇదిలావుంటే, ఎన్నికల విధుల్లో ఉన్న లీలావతి అనే ఉపాధ్యాయురాలు గుండెపోటుతో మరణించారు. హావేరికి చెందిన ఆమె వయసు 35 సంవత్సరాలు.